చైనా యాప్స్​ను నిషేధిస్తూ భారత్​ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో స్వాగతించారు. ఈ నిర్ణయంతో భారత సమగ్రత, దేశ జాతీయ భద్రత మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

 

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్​కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో భారత్​కు ఫ్రాన్స్​ అండగా ఉంటుందని ఆ దేశ రక్షణమంత్రి ఫ్లోరెన్స్​ పార్లె ఇటీవలే వెల్లడించారు. తాజాగా... 59 చైనా యాప్స్​ను నిషేధిస్తూ భారత్​ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది. ఈ నిర్ణయం భారత సమగ్రత, దేశ జాతీయ భద్రతను పెంపొందిస్తుందని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో అభిప్రాయపడ్డారు.

 

సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలు, గల్వాన్​ లోయలో హింసాత్మక ఘటన నేపథ్యంలో భారత్​లో చైనాకు వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే టిక్​టాక్​ సహా చైనాకు చెందిన 59 యాప్స్​ను భారత్​ నిషేధించింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: