కరోనా వైరస్ తో దాడి చేసారు అని అమెరికా చైనాపై గత కొన్ని రోజులుగా విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం చైనానే వాళ్ళు నిజాలు దాచారు అని అమెరికా అధ్యక్షుడి నుంచి ఆయన కేబినేట్  మంత్రుల వరకు ఆరోపణలు చేస్తున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు అమెరికా.. చైనా విషయంలో కఠినం గా ఉండాలి అనే సలహాను ఇస్తున్నారు. ఏంటీ అంటే...  అమెరికా యాప్స్ ని చైనా ఎలాగూ బాన్ చేసింది కాబట్టి భారత్ తరహాలోనే చైనా యాప్స్ ని అమెరికా కూడా బాన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ దీనిపై నిర్ణయం తీసుకోవాలి అని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: