తేలికపాటి  కరోనా లక్షణాలు ఉన్న కేసులకు చికిత్స చేయడానికి హైదరాబాద్ లాలాగుడలోని సౌత్ సెంట్రల్ రైల్వే సెంట్రల్ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎనిమిది మంది రోగులతో చికిత్స బుధవారం ప్రారంభమైంది, వీరంతా ఎస్సీఆర్ ఉద్యోగులని అధికారులు పేర్కొన్నారు. 300 పడకల సెంట్రల్ హాస్పిటల్ కాగా... ఎస్.సి.ఆర్ ఉద్యోగులతో పాటుగా వారి కుటుంబ సభ్యుల కోసం 100 పడకలను కరోనా కోసం పక్కన పెట్టారు వైద్యులు. 

 

లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుండి రైల్వే ఉద్యోగులు తమ విధులకు హాజరవుతున్నారని, వారిలో కొందరికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి అని అధికారులు పేర్కొన్నారు. సుమారు 15 మంది ఎస్.సి.ఆర్ ఉద్యోగులకు కరోనా సోకింది అని వెల్లడించారు. ఇక్కడ అధికారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని కరోనా చికిత్సలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: