ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా ప్రాంతం సహా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణాలో నేడు రేపు భారీ వర్షాలు కురుస్తాయని పిడుగులు కూడా పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ పేర్కొంది. 

 

ఇక ఇదిలా ఉంటే తెలంగాణాలో ఈ ఏడాది సాధారణం కంటే 30 శాతం అధికంగా  వర్షాలు పడ్డాయి అని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెలలో కూడా అదే స్థాయిలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.  రాయలసీమ జిల్లాల్లో వాతావరణం కాస్త పొడిగా ఉందని అక్కడక్కడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: