ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు పంజా విసురుతోంది. ఎటు చూసినా కరోనా పంజా విసురుతోంది. వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కేసులు కోటి 8 లక్షలు దాటాయి. ఇక ఇప్ప‌టికే 235కు పైగా దేశాలు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డ్డాయి. ప్ర‌పంచంలోని కోట్లాది మంది ప్ర‌జలు క‌రోనా పేరు చెపితేనే భ‌య‌ప‌డిపోతున్నారు. ఇక మ‌ర‌ణాలు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 

 

ఇక ఈ క‌రోనా కేవ‌లం ప్ర‌జారోగ్యంతో పాటు ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌, ప్ర‌జ‌ల జీవ‌న విధానంపై సైతం తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,08,03,599 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 5,18,968 మంది మృతి చెందగా.. కరోనా భారినపడి చికిత్స పొంది 59,39,017 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 27,79,953 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 1,30,798 మంది మృతి చెందగా.. కరోనా బారిన పడి 11,64,680 మంది కోలుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: