అమెరికా అధ్య‌క్ష రేసుకు డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్ అధికారికంగా క‌న్ఫ‌ర్మ్ అయ్యారు.  న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో..  డోనాల్డ్ ట్రంప్‌పై బైడెన్ పోటీ చేయ‌నున్నారు.  దేశ ఆత్మ‌ను కాపాడేందుకు ఇక తాను అధ్య‌క్ష పోరులో నిల‌వ‌నున్న‌ట్లు బైడెన్ ఆ సోషల్ పోస్ట్ లో వెల్ల‌డించారు.  ఏప్రిల్‌లో పార్టీ రేసు నుంచి బెర్నీ శాండ‌ర్స్ త‌ప్పుకోవ‌డంతో.. బైడెన్ రూటు సులువైంది.  మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా హ‌యాంలో.. జోసెఫ్ బైడెన్ ఉపాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.  అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే తమ విదేశాంగ విధానంలో భారత్​కు అధిక ప్రాధాన్యమిస్తామని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ స్పష్టం చేశారు.

 

రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఓ ఎన్నికల ఫండ్​ రైజింగ్ కార్యక్రమంలో తెలిపారు. ఈ మద్య భారత్ - చైనాల మద్య వచ్చిన వైరంపై కూడా ఆయన ఘాటుగానే స్పందించారు. చైనా చేస్తున్న దురాగతాలపై భారత్  నిలదీయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 77 ఏళ్ల బైడెన్ అమెరికా అధ్య‌క్ష స్థానానికి పోటీ ప‌డ‌డం ఇది మూడ‌వ సారి.  దేశాధ్య‌క్షుడికి కావాల్సిన అన్ని అర్హ‌త‌లు బైడెన్‌కు ఉన్న‌ట్లు ఒబామా తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: