దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నా సరే లక్ష కేసుల దిశగా ఢిల్లీలో కరోనా కేసులు వెళ్ళడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే అక్కడ ప్లాస్మా బ్యాంకు ని ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై తాజాగా సిఎం అరవింద్ కేజ్రివాల్ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

మీరు కరోనా నుండి కోలుకుంటే & మీ వయస్సు 18 మరియు 60 మధ్య ఉంటే & మీ బరువు 50 కిలోల కంటే ఎక్కువగా ఉంటే, మీరు రోగులకు ప్లాస్మాను దానం చేయవచ్చని ఆయన అన్నారు.  అయితే, ప్రసవించిన మహిళలు లేదా కొమొర్బిడిటీ ఉన్నవారు ప్లాస్మా దానం చేయడానికి అర్హులు కాదని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: