కరోనా కల్లోలం ప్రపంచవ్యాప్తంగా ఎలా వుందో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ప్ర‌పంచానికే పెద్దన్న‌లం అని ఠీవీగా ఉండే అమెరికా దేశం కూడా చేతులు ఎత్తేసింది. ఇప్పుడు అక్క‌డ రోజుకు 55 వేల‌కు పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక క‌రోనా వ‌ల్ల కొన్ని కోట్ల మంది  ఈ యేడాది నిరుద్యోగులు అవుతున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 

 

ఈ యేడాది సెకండాఫ్‌లో ఏకంగా 34 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నార‌ట‌. ఇప్ప‌టికే ఇత‌ర దేశాల నుంచి అమెరికా లాంటి దేశాల‌తో పాటు గ‌ల్ప్ దేశాల‌కు వెళ్లిన కొన్ని కోట్ల మంది నిరుద్యోగులుగా మారి ఇళ్ల‌కు వ‌స్తున్నారు. ఇక 34 కోట్ల మందికి ఉద్యోగాలు పోవ‌డం అనేది ప్రపంచ పనిగంటల్లో 11.9 శాతానికి సమానమని నివేదిక పేర్కొంది. అంతేకాదు, ఇప్పటికే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ప్రపంచ పనిగంటలు 14 శాతానికి తగ్గినట్టు పేర్కొంది. ఇది ఇంచుమించు 400 మిలియన్ ఉద్యోగాలు కోల్పోయిన దానికి సమానమని వివరించింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: