సిఎం కేసీఆర్ ప్రకటనలు, మాటలకు క్షేత్రస్థాయిలో అమలకు పొంతన లేదని తెలంగాణా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. కరోనాపై ప్రజలకున్న అనుమానాలను తీర్చాల్సిన  బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేసారు. కరోనా బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఆయన మండిపడ్డారు. కరోనా బాధితుల కోసం తక్షణమే 5 వేల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని ఆయన కోరారు. 

 

కరోనాను కట్టడి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయటంలేదని ఆయన ఆరోపణలు చేసారు. గాంధీ ఆస్పత్రికి 3 వేల కోట్లు.. మిగిలిన జిల్లా ఆస్పత్రులకు 2 వేల కోట్లు కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన విరాళాలపై కూడా శ్వేతపత్రం విడుదల ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: