ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయంతో ప్రజలు వణికిపోతున్నారు. మరోపక్క ప్రకృతి విళయతాండవం చేస్తుంది.  తుఫాన్లు,భారీ వర్షాలు,  భూకంపాలతో ప్రజలు వణికిపోతున్నారు.  తాజాగా మయన్మార్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర మయన్మార్‌లోని జాడే గని వద్ద కొండా చరియలు విరిగిపడ్డాయి.. దాంతో 50 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ఆ దేశంలోని అగ్నిమాపక సేవా విభాగం, సమాచార మంత్రిత్వ శాఖ అధికారి నిర్దారించారు. కాచిన్ రాష్ట్రంలోని జాడే-రిచ్ హపకాంత్ ప్రాంతంలో మైనర్లు రాళ్ళు సేకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించింది.

 

భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడగా.. మట్టిదిబ్బలో చాలా మంది చిక్కుకుపోయారని తెలుస్తోంది. అధికారులు యుద్ద‌ప్రాతిప‌దిక‌న‌ సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్న‌ట్లు సమాచారం.  అధికారులు ఇప్పటికే సహాయక చర్యలను ప్రారంభించారు. అక్కడ ఎక్కడ చూసినా ఆర్తనాదాలు మిన్నంటిపోతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: