ప్రపంచంలో ఓ వైపు కరోనాతో నానా కష్టాలు పడుతున్నారు ప్రజలు. ఏ క్షణంలో కరోనా వైరస్ సోకుతుందో.. ఎంత నరకం అనుభవించాలో అన్న భయం గుప్పిట్లో ప్రజలు బతుకుతున్నారు. మరోవైను కొంత మంది ఉన్మాదులు రెచ్చిపోతున్నారు.. పిచ్చి పట్టిన వాళ్లలా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా మెక్సికోలో దారుణం చోటుచేసుకుంది.  ఓ ఉన్మాది కాల్పుల్లో 24 మంది మరణించారు.  ఇరపాటో నగరంలోని మాదక ద్రవ్యాల బాధితుల పునరావాస కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రగ్స్‌ డీ అడిక్షన్‌ కేంద్రంలోకి చొరబడిన దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.

 

దీంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు రక్తపు మడుగులో పడి ఘటనా స్థలం భయానకంగా మారింది. కాల్పుల ఘటన వెనుక డ్రగ్స్‌ ముఠాల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా,  ఇరపువాటలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. జూన్‌ 6న కూడా పునరావస కేంద్రంపై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడటంతో 10 మంది మరణించారు.

 

గతంలో 2010లో చివావా నగరంలోని డ్రగ్స్‌ డీఅడిక్షన్‌ సెంటర్‌పై ఇదేవిధంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 19 మంది మరణించారు. తాజాగా జరిగిన కాల్పుల ఘటన 2020లో ఏడాదిలో అతి పెద్ద నరమేధంగా అక్కడి వారు భావిస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: