భార‌త ప్ర‌భుత్వం చైనాతో స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త ప‌రిస్థితుల నేప‌థ్యంలో దూకుడుగా నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే భారతదేశ సమగ్రతకు, భద్రతకు ముప్పు వాటిల్లుతోందనే కారణంతో 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. ప్ర‌పంచంలోనే ఎంతో పాపుల‌ర్ యాప్ అయిన టిక్ టాక్ యాప్ వ‌ల్ల ఇక్క‌డ భారీగా పెట్టుబ‌డులు పెట్టిన చైనా కంపెనీలు భారీగా న‌ష్ట‌పోతున్నాయి.

 

టిక్‌టాక్, విగో వీడియో, హలో వంటి చైనా యాప్‌లను నిషేధించ‌డం వల్ల వీటి మాతృ సంస్థ అయిన బైట్‌డాన్స్‌కు ఘోరమైన దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ సంస్థ దాదాపు 6 బిలియన్‌ డాలర్ల వరకు నష్టపోయినట్లు స‌మాచారం. ఈ ఫిగ‌ర్ వింటుంటేనే క‌ళ్లు బైర్లు క‌మ్మేలా ఉంది. ఈ నిషేధం ఇలాగే కొన‌సాగితే  ఆ సంస్థ‌కు భారీన‌ష్టం త‌ప్ప‌దు.

మరింత సమాచారం తెలుసుకోండి: