మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడానికి కారణం సామాజిక వ్యాప్తి అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో దీనిపై ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే మాట్లాడుతూ  కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ మహమ్మారి సామాజిక వ్యాప్తి జరగడం లేదని ఆయన అన్నారు. అత్యధిక కొత్త కేసులు సంస్థాగత క్వారంటైన్, హోం క్వారంటైన్, లేదా కాంటాక్ట్ హిస్టరీ ఉన్నవేనని  ఆయన వివరించారు. 

 

కోవిడ్-19 మహమ్మారి సామాజిక వ్యాప్తి జరగడం లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి జరుగుతున్నట్లు తాను భావించడం లేదని అన్నారు ఆయన. ప్రజలు ఎవరూ కూడా భయపడవద్దు అని ఆయన కోరారు.  కనీసం నేటి పరిస్థితినిబట్టి చూసినపుడు, ఇక్కడ  కోవిడ్-19 మహమ్మారి సామాజిక వ్యాప్తి లేదనే అభిప్రాయం ఉందని ఆయన వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: