ఈశాన్య రాష్ట్రాల్లో ఈ మధ్య వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అదే విధంగా జమ్మూ కాశ్మీర్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల రెండు నిమిషాలకు కత్రా, జమ్మూ & కాశ్మీర్ సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ 3.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు. 

 

ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భూకంప తీవ్రత అంతగా లేదు అని ప్రభుత్వం పేర్కొంది. ఇక ఈ  భూకంప తీవ్రతకు ఏమైనా ఆస్తి ప్రాణ నష్టం జరిగిందా అనే దానిపై స్పష్టత రాలేదు. కాగా వారం రోజుల్లో ఇది మూడో భూకంపం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: