టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని 2.6 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు అని ఏపీ ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. చంద్రబాబు 5 ఏళ్ళలో 15 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తే తాము ఏడాదిలోనే 10 వేల కోట్లను రైతులు అందించామని, రైతు భరోసా రూపంలో వారికి అండగా నిలిచామని సజ్జల అన్నారు. 

 

చంద్రబాబు కేవలం జూమ్ కాన్ఫరెన్స్ లేక్ పరిమితం అయ్యారు అని సజ్జల మండిపడ్డారు. కరోనా కష్ట కాలంలో పేదలకు 28 వేల కోట్లు ఖర్చు చేసామని ఆయన అన్నారు. 108 వాహనాలను 1088 ప్రారంభించామని, అధునాతన పరికరాలను అంబులెన్స్ లను ప్రారంభించామని అన్నారు. 1800 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను తాము చెల్లించామని ఆయన అన్నారు. పెండింగ్ బిల్స్ 40 వేల కోట్లు చెల్లించామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp