పారా మిలటరీ బలగాల్లో ట్రాన్స్‌జెండర్లను అసిస్టెంట్‌ కమాండెంట్లుగా నియమించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. వారిని ఎంపిక చేసే అంశంపై వైఖరేంటో చెప్పాలని సీఏపీఎఫ్ బలగాలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది.ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ విభాగాల్లో ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై కేంద్రం చాన్నాళ్ల నుంచి యోచిస్తోంది. 

 

 


 వారి నియామకాల విధివిధానాలు ఎలా ఉండాలో చెప్పాలని సీఏపీఎఫ్‌లను తాజాగా కోరింది. 'రాయల్‌ బాడీగార్డులు ట్రాన్స్‌జెండర్లు, అత్యంత బలవంతులని మనం గుర్తుంచుకోవాలి. ఒక అధికారిగా ఉండేందుకు అవసరమైన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే వారెందుకు ఉండకూడదు?' అని ఓ ఐటీబీపీ అధికారి అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: