2019 పుల్వామా ఉగ్రదాడి కేసులో మరో నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకుంది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ). అతడిని 25ఏళ్ల మహమ్మద్​ ఇక్బాల్​ రాథేర్​గా పేర్కొంది. ఇక్బాల్​ జమ్ముకశ్మీర్​లోని బుద్గామ్​వాసి. పుల్వామా ఉగ్ర దాడికి కుట్ర పన్నిన కీలక వ్యక్తి, జైషే మహమ్మద్​ సభ్యుడు ముహమ్మద్​ ఉమర్​ ఫరూక్​.. భారత భూభాగంలోకి చొరబడిన అనంతరం.. అతడికి ఇక్బాల్​ సహాయం చేశాడని ఎన్​ఐఏ ప్రతినిధి తెలిపారు. పుల్వామా దాడిలో ఉపయోగించిన ఎల్​ఈడీని ఇతరులతో కలిసి ఫరూక్​ తయారుచేశాడని ఎన్​ఐఏ ప్రతినిధి వెల్లడించారు. ​

 

 

అయితే జైషే మహమ్మద్​కు సంబంధించిన మరో కేసులో భాగంగా.. 2018సెప్టెంబర్​ నుంచి ఇక్బాల్​ జ్యూడిషియల్​ కస్టడీలో ఉన్నాడు. తాజాగా అతడిని జమ్ములోని ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు అధికారులు. అనంతరం విచారణ నిమిత్తం ఇక్బాల్​ను 7రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నట్టు వెల్లడించారు.

2019 ఫిబ్రవరి 14న సీఆర్​పీఎఫ్​ వాహనాలపై జైషే మహమ్మద్​ ఉగ్ర దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 40మంది జవాన్లు అమరులయ్యారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: