అమెరికా వాషింగ్టన్​లో ఆందోళన కారులు ధ్వసం చేసిన భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి పునరుద్దరించారు. భారత రాయబారి తరంజిత్ సింగ్ గురువారం ఉదయం గాంధీ విగ్రహాన్ని తిరిగి ప్రారంభించారు. మహాత్మునికి నివాళులు అర్పించారు. గాంధీ ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సామరస్యం సందేశాలు ప్రపంచానికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

 

 

నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్​ మృతికి నిరనసగా అమెరికాలో తీవ్ర ఆందోళనలు చేపట్టారు ప్రజలు. జూన్ 3న వాషింగ్టన్​లోని గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భారత్​కు అమెరికా క్షమాపణలు చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: