ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా కేసులు ఇప్ప‌టికే 1.10 కోట్ల‌కు చేరువ అవుతున్నాయి. క‌రోనా మ‌ర‌ణాలు కూడా 5.23 ల‌క్ష‌ల‌కు చేరువైన సంగ‌తి తెలిసిందే. ఇక మ‌న దేశంలో కూడా క‌రోనా కేసులు 6 ల‌క్ష‌ల‌కు వెళ్లాయి. ఇక ఇప్పుడిప్పుడే ఈ క‌రోనా వైర‌స్‌కు అంతం ఉంటుందా అన్న‌ది కూడా ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే జూన్‌ నెలలో భారతీయ నెటిజన్లు సెర్చ్‌ చేసినట్టు గూగుల్‌ సెర్చ్‌ ట్రెండ్స్‌ వెల్లడించింది. క‌రోనా గురించి పలు విష‌యాల‌ను వీరు గూగుల్‌లో సెర్చ్ చేశారు.

 

కరోనా వైరస్‌కి ఏ మాస్క్‌ మంచిది, కరోనా వైరస్‌ని న్యూజిలాండ్‌ ఎలా అణచివేసింది, కరోనా వైరస్‌ లక్షణాలు ఎన్ని రోజులు ఉంటాయి, ప్రపంచంలో కరోనా వైరస్‌ వల్ల ఎంతమంది మరణించారు ఇలాంటి విష‌యాల‌ను వీరు గూగుల్లో ఎక్కువుగా సెర్చ్ చేశారు. మేతో పోలిస్తే జూన్‌లో కరోనా వైరస్‌ గురించి నెటిజన్లు సెర్చ్‌ చేయడం 66 శాతం తగ్గింది, ఫిబ్రవరిలో కంటే జూన్‌లో కరోనాపై గూగుల్‌ సెర్చ్‌ రెట్టింపు కంటే ఎక్కువైందని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: