అమాకులు దొరికితే అందినంత దోచేస్తున్నారు కొంత మంది సైబర్ మోసగాళ్లు.  టెక్నాలజీని అడ్డు పెట్టుకొని ప్రజలను ఈజీగా బురిడీ కొట్టిస్తూ లక్షలు, కోట్లు దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్ళు.  ఎన్ని రకాలుగా ప్రజలకు అవగాహన కల్పించినా.. ముఖ్యంగా మనకు వస్తున్న ఎస్ఎంఎస్ విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎవరు ఎం చెప్పినా మనకు సంబంధించిన డీటేల్స్ ఇవ్వకూడదని సూచించినా కొంత మంది అమాయకంగా తమ డేటా ఇవ్వడం తీరా అకౌంట్ లో డబ్బులు ఖాళీ అయ్యాక సైబర్ పోలీస్ స్టేషన్ల కు వెళ్లడం కామన్ అయ్యింది.

 

తాజాగా ఎయిర్ టెల్ మినీ పేమెంట్ బ్యాంక్ ముసుగులో రైతుల ఖాతాలో నగదు స్వాహా చేశారు కొంత మంది సైబర్ మోసగాళ్ళు.  నరసరావుపేట మండలం పాలపాడు లో వెలుగు చూసిన ఘటన ఎయిర్ టెల్ kyc ముసుగులో రైతుల నుంచి వేలిముద్రలు తీసుకొని 150 మంది రైతుల ఖాతాల నుండి సుమారు 15 లక్షల నగదు స్వాహా చేశారు. ఇక జరిగిన మోసం పై నరసరావుపేట ఎయిర్ టెల్ కార్యాలయంలో సంప్రదించగా అక్కడ సిబ్బంది స్పందించకపోవడంతో రైతులు పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: