పలు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయడంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దేశంలో పలు వ్యవస్థలను ఇప్పటికే కేంద్రం ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. ఈ నేపధ్యంలో దీనిపై దేశంలో వామపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కార్మిక సంఘాల నిరసనలకు సీపీఐ మద్దతిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

 

కరోనా వైరస్ ను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం సిద్ధమైందని ఆయన మండిపడ్డారు. 151 ప్యాసింజర్‌ రైళ్ల నిర్వహణను ప్రైవేటు పరం చేస్తున్నారని ఈ సందర్భంగా విమర్శలు చేసారు. ఇస్రో కూడా ప్రైవేటు భాగస్వామ్యానికి దారులు తీసిందని ఆయన విమర్శించారు. రక్షణ రంగంలో 75 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించిందని ఆరోపించారు. ఎయిర్ ఇండియాను అమ్మేందుకు కేంద్రం యత్నిస్తున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: