ఈ మద్య మళ్లీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇటీవల లాక్ డౌన్ సడలించిన తర్వాత వరుసగా రోడ్డు ప్రమాదాల సంఖ్య తీవ్రం అవుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో రోడ్లపైకి వాహనాల రాకపోకలు తక్కువ అయ్యాయి.. దాంతో ప్రమాదాల సంఖ్య తగ్గింది. కానీ ఈ మద్య మళ్లీ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి.  ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడిక్కడే మరణించారు. గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది.

 

ద్విచక్ర వాహనం పై తమ ఇంటికి వస్తున్న సమయంలో పాడువ వద్ద వీరి వాహనం ఓ చెట్టును ఢీకొట్టి అదుపుతప్పి లోయలో పడిపోయింది. అదే సమయంలో తీవ్రంగా వర్షం రావడంతో అక్కడ వారిని ఎవరూ గమనించలేకపోయారు. ఈ క్రమంలోనే ఇద్దరికి తీవ్ర గాయాలతో అక్కడిక్కడడే మృతి చెందారు. వీరంతా మైనర్లు కాగా.. ఎవరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

 

తర్వాత అక్కడికి స్థానికులు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం కోరాపుట్ హాస్పిటల్‌కు తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులుగా కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ సాగుతోందని పోలీసులు తెలిపారు.

 

 

 


 

 

మరింత సమాచారం తెలుసుకోండి: