ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వారి కోసం ఒక కార్పోరేషన్ ని ఏర్పాటు చేసి దాదాపు 50 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ... అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చామని ఆయన అన్నారు. 

 

ఉద్యోగం కోసం లంచాలు ఇచ్చే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రతీ నెల ఒకటో తేదీనే జీతం చెల్లిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఎటు వంటి లంచాలు వివక్ష లేకుండా జీతాలు వారి చేతికే వెళ్తాయని అన్నారు ఆయన. ఈఎస్ఐ, పీఎఫ్ వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేసారు. ఉద్యోగుల సంఖ్యను వచ్చే రోజుల్లో పెంచుతామని సిఎం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: