అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వస్తామని సిఎం జగన్ అన్నారు. పాదయాత్ర సందర్భంగా అనేక సమస్యలను తన వద్దకు తీసుకుని వచ్చారు అని సిఎం జగన్ అన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పోరేషన్ ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు  20 మంది అని చెప్పి 15 తో  పని చేయించి 20 మంది జీతం తీసుకునే వారు అని అన్నారు. 

 

ఇక నుంచి ఆ దళారి వ్యవస్థ అనేది ఎక్కడా ఉండదు అని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలను చెల్లిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఎవరూ కూడా జీతాల కోసం ఇబ్బంది పడకూడదని అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: