అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎన్నో మార్పులు తీసుకుని వచ్చామని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు. గతంలో ఉద్యోగం రావడానికి జీతాలు రావడానికి  కూడా నానా రకాలుగా వేధించే వారు అని అన్నారు. గతంలో ఏడు గుళ్ళకు సంబంధించి పారిశుధ్య కార్మిక పనుల్లో అవినీతి ఉందని అన్నారు.  ఒక్కో గుడికి నాలుగు లక్షలు ఉంటే... 

 

30 లక్షలు కేటాయించారు అని సిఎం జగన్ ఆరోపించారు. ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి భాస్కర నాయుడు అని సిఎం అన్నారు. ఆ భాస్కర నాయుడు ఎవరు అంటూ  చంద్రబాబు నాయుడు బంధువు అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఈసారి ఆ విధమైన దళారి వ్యవస్థ అనేది ఉండదు అని సిఎం స్పష్టం చేసారు. అందరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: