1 ఏప్రిల్ 2020 నుండి, కేంద్రం 2.02 కోట్లకు పైగా N95 మాస్క్ లతో పాటుగా 1.18 కోట్లకు పైగా పిపిఈ కిట్లను రాష్ట్రాలు మరి కేంద్ర పాలిత్ ప్రాంతాలకు అందించింది అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటిని ఉచితంగా అందించామని పేర్కొంది. 11,300 'మేక్ ఇన్ ఇండియా' వెంటిలేటర్లతో పాటు 6.12 కోట్లకు పైగా హెచ్‌సిక్యూ టాబ్లెట్లు కూడా పంపిణీ చేసామని పేర్కొంది. 

 

దేశ రాజధాని ఢిల్లీలో 7.81 లక్షల పిపిఈ కిట్స్  మరియు 12.76 లక్షల ఎన్ 95 మాస్క్ లు అందించామని చెప్పింది. మహారాష్ట్రలో 11.78 లక్షల పిపిఈలు మరియు 20.64 లక్షల ఎన్ 95 మాస్క్ లు అందించామని చెప్పింది. తమిళనాడుకి గానూ 5.39 లక్షల పిపిఈ మరియు 9.81 లక్షల ఎన్ 95 మాస్క్ లను అందించామని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: