మలేరియా... ఈ పేరు వినగానే మన దేశం ఒకప్పుడు వణికిపోయింది. ఆ పేరు వినగానే చాలా మంది తల్లి తండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. చాలా మంది తమ ఆప్తులను ఆ రోగం కారణంగా కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాంటి మలేరియాకు మందు కనుక్కున్నారు ఒక మహిళ. ఆమెకు తాజాగా నోబెల్ బహుమతిని ప్రకటించారు. 


“తు యూయు అనే మహిళ మలేరియా చికిత్సకు ఉపయోగపడే ఆర్టెమిసినిన్ అనే పదార్థాన్ని కనుగొన్నారు. సాంప్రదాయ చైనీస్ ఔషధం నుండి ఆర్టెమిసినిన్ను తీయడానికి తు ఒక మార్గాన్ని కనుగొనడమే కాక, ఈ పరీక్షలను తన మీద తానే చేసుకున్నారు.” ఈ విషయాన్ని నోబెల్ ప్రైజ్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. దీనిపై సోషల్ మీడియాలో ప్రసంశలు వస్తున్నాయి. మనదేశంలో సెరిబ్రల్ మలేరియా తో చనిపోకుండా ఎంతో మంది పిల్లల , పెద్దల ప్రాణాలు కాపాడిన దేవత. ఈమెకి ఏమిచ్చినా తక్కువే. అంటూ  కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: