ప్రధాని నరేంద్ర మోదీ లద్ధాఖ్ పర్యటనలో మాట్లాడుతూ లద్దాఖ్ ప్రజలు సైనికుల వెంట ఉన్నారని అన్నారు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు మూడింతలు పెంచామని తెలిపారు. భారత సైనికుల సామర్థ్యం హిమాలయాల కంటే గొప్పదని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి కోసం చేయాల్సిందంతా చేస్తున్నామని అన్నారు. లద్దాఖ్ వేదికగా మోదీ చైనాకు పరోక్షంగా ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. 
 
దేశ రక్షణ కోసం ఆధునిక అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నామని అన్నారు. భారత సైనికుల తెగువ వెలకట్టలేనిదని చెప్పారు. దేశ సేవలో అమరులైన సైనికులకు మోదీ శ్రద్ధాంజలి ప్రకటించారు. బలహీనులు శాంతిని సాధించలేరని... బలమైనవాళ్లు మాత్రమే శాంతిని సాధించగలమని పేర్కొన్నారు. దేశ రక్షణ జవాన్ల చేతుల్లోనే ఉందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: