అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ పై, ఆ దేశం తీరుపై విమర్శలు చేశారు. ట్రంప్ కరోనా వైరస్ ను చైనా నుంచి వచ్చిన ప్లేగుగా పేర్కొన్నారు. కరోనా వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందడానికి చైనానే కారణమని మరోమారు ట్రంప్ విమర్శలు చేశారు. ఇరు దేశాల మధ్య సరికొత్త వాణిజ్య ఒప్పందం జరిగిన వెంటనే కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిందని వ్యాఖ్యలు చేశారు. 
 
ట్రంప్ నేడు జులై నెలను "అమెరికా కార్మికుల నెలగా వాగ్దానం" చేసిన ప్రకటనపై సంతకం చేశారు. మరోవైపు అమెరికాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో అమెరికాలో రోజుకు లక్ష కేసులు నమోదైనా ఆశ్చర్యం లేదని అక్కడి వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో ఇప్పటివరకు 28 లక్షల కేసులు నమోదు కాగా 1,30,000 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

lie