గత కొంత కాలంగా రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే పద్దెనిమిది వేల మార్క్‌ దాటేసింది.  దేశంలో కరోనా ఎప్పుడైతే మొదలైందో.. అప్పటి నుంచి మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  రాజస్థాన్ ప్రభుత్వం మొత్తం 103 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సంచనల నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజీవ్ స్వరూప్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆరోగ్య కార్యదర్శిగా ఉన్న రోహిత్ కుమార్ సింగ్‌కు హోం కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. బదిలీ చేసిన జాబితాలో ముగ్గురు అదనపు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు డివిజినల్ కమిషనర్లు, 15 మంది కలెక్టర్లు ఉన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న డి బి గుప్తా విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవపోవడం గమనార్హం. కరోనా విజృంభిస్తున్నప్పటి నుంచి ఆరోగ్య విభాగ బాధ్యతలను అఖిల్ అరోరా నిర్వర్తిస్తున్నారు. 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: