కరోనా లాక్ డౌన్ సమయంలో ఇప్పుడు అందరూ కూడా సినిమాలను దాదాపుగా ఓటీటీ లోనే వీక్షిస్తున్నారు. సినిమా హాల్ కి వెళ్ళే అవకాశాలు లేకపోవడంతో దాదాపు అందరూ కూడా ఓటీటీ లోనే సినిమాలను ఎక్కువగా చూస్తూ వస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ తన వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.
విండోస్ 10 యూజర్ల కోసం అమెజాన్ ఇండియా డెస్క్టాప్ అప్లికేషన్ను విడుదల చేసినట్టు ప్రకటించింది. ఇప్పటి నుంచి ల్యాప్టాప్, ట్యాబ్లెట్, పర్సనల్ కంప్యూటర్ యూజర్లు ప్రైమ్ వీడియో యాప్ దారా సినిమాలను వీక్షించే అవకాశం ఉంటుంది. అంతే కాదు ఇక నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కూడావిండోస్ లో ఇచ్చింది అమెజాన్ ప్రైమ్.