ఈఎస్‌ఐ స్కాంలో మాజా మంత్రి అచ్చెంనాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు అరెస్ట్‌ కాకముందు ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలోనే అచ్చన్నకు బెయిల్ ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈఎస్‌ఐ కొనుగోళ్ల స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడి విషయంలో ప్రభుత్వ యంత్రాంగం మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. రెండోసారి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడకున్నా.. బుధవారం సాయంత్రం హడావుడిగా జీజీహెచ్‌ అధికారులు ఆయన్ను డిశ్చార్జి చేశారు.

 

పోలీసులు ఆయన్ను వీల్‌చైర్‌లో కూర్చోబెట్టి.. అంబులెన్సులో ఎక్కించి విజయవాడ సబ్‌జైలుకు తీసుకెళ్లారు. ఈ అంశంపై శనివారం తీర్పు ఇస్తామని హైకోర్టు తెలిపింది. కాగా, చ్చెన్నాయుడుకు రెండోసారి శస్త్రచికిత్స జరిగిందని, చికిత్స తర్వాత పరిస్థితి ఇబ్బందిగా మారిందని అచ్చెన్న.. లాయర్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అచ్చెన్నకు మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాలని లాయర్‌ విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: