పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది.   రైల్వేక్రాసింగ్ వద్ద బస్సును అతివేగంతో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. దాంట్లో ప‌ది మంది సిక్కు యాత్రికులు ఉన్న‌ట్లు గుర్తించారు.  క‌రాచీ నుంచి లాహోర్ వెళ్తున్న స‌మ‌యంలో ఈ దుర్ఘ‌ట‌న‌ జ‌రిగింది. షేక్‌పురా రైల్వే స్టేష‌న్ వ‌ద్ద షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్‌ను.. సిక్కు యాత్రికులు వెళ్తున్న వాహ‌నం ఢీకొట్టింది.  నాన్‌కానా సాహిబ్ నుంచి తిరుగు ప్ర‌యాణం చేస్తున్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  

 

ఒకే ఫ్యామిలీకి చెందిన 25 మంది యాత్రికులు మినీ బస్సులో  వెళుతుండగా  ఫరీదాబాద్ వద్ద రైల్వే క్రాసింగ్ దాటుతున్న సమయంలో కరాచీ-లాహోర్ షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. గాయ‌ప‌డ్డ‌వారిని స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ది. షేక్‌పురాలో మాన‌వ‌ర‌హిత లెవ‌ల్ క్రాసింగ్ వ‌ద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

 

ఈ ఘ‌ట‌న త‌ర్వాత డివిజిన‌ల్ ఇంజినీర్‌ను స‌స్పెండ్ చేశారు. బాధ్యులైన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రైల్వే మంత్రి షేక్ ర‌షీద్ ఆదేశించారు.   ఇదిలా ఉంటే నాలుగు నెలల క్రితం సింధు ప్రావిన్సులో కూడా రైల్వే క్రాసింగ్ వ‌ద్ద ప్ర‌మాదం జరిగింది. ఆ ప్ర‌మాదంలో 19 మంది మ‌ర‌ణించారు. 30 మంది గాయ‌ప‌డ్డారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: