భారీ వర్షాల వల్ల వరదలతో అతలాకుతలం అవుతోంది అసోం. రాష్ట్రంలోని పరిస్థితిని తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​తో ఫోన్​లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విపత్కర సమయంలో రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అసోం వరదల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులకు పీఎం రిలీఫ్​ ఫండ్​ నుంచి రూ. 2లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

 

రాష్ట్రంలో కరోనా, వరదల బీభత్సం వంటి విషయాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారని అసోం సీఎం సోనోవాల్​ తెలిపారు. కేంద్రం నుంచి అవసరమైన సహకారాన్ని అందించనున్నట్లు మోదీ చెప్పారని పేర్కొన్నారు.వరదల వల్ల అసోంలో 33 జిల్లాలకు గానూ 22 జిల్లాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. 16.03 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: