అత్యధికంగా అమెరికాలో 29 లక్షలకు దగ్గరగా నమోదైన కేసులు. లక్షా 32 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 11.91 లక్షల మంది వైరస్​నుంచి కోలుకున్నారు. మరో 15.14 లక్షల మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలందరూ మాస్కులు ధరించి ఇళ్లలోనే ఉండాలని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ పిలుపునిచ్చారు.

 

 వారాంతపు సెలవుల్లో సాంప్రదాయ వేడుకలు నిర్వహించొద్దని కోరారు.మాస్కులు ధరించే విషయంలో కాలిఫోర్నియా అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు క్రిమినల్ చర్యలు చేపడతామని దాదాపు 3.5 లక్షల మంది వ్యాపారులకు లేఖ రాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: