కరోనా వైరస్ అనే పేరు వింటే చాలు ప్రపంచం మొత్తం కూడా భయపడుతుంది. కరోనా వైరస్ ని ఏ విధంగా కట్టడి చెయ్యాలో అర్ధం కాక నానా ఇబ్బందులు పడుతుంటే ఇది జంతువులకు కూడా సోకడం ఇప్పుడు కంగారు పెట్టే అంశం. తాజాగా ఈ కరోనా వైరస్ ఒక పెంపుడు కుక్కకు సోకింది. జార్జియా దేశంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

 

ఆరేళ్ళ వయసు ఉన్న ఒక కుక్కకు కరోనా లక్షణాలు కనపడటంతో దానిని కరోనా పరిక్షలకు తరలించగా దానికి కరోనా సోకింది అని వెల్లడించారు. అయితే దాని వలన  మనుషులకు సోకే అవకాశాలు చాలా తక్కువ అని అధికారులు చెప్పారు. భయం అవసరం లేదని అంటూనే దాని యజమానిని క్వారంటైన్ లో ఉండాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: