గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్ధి, వైసీపీ నేత పీవీపీ కోసం హైదరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. ఆయన కోసం హైదరాబాద్ పోలీసులు విజయవాడ  వచ్చారు. జుబ్లీహిల్స్  పోలీసులు ఆయన కోసం ఆయన ఇంటికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆయన తన ఇంట్లో లేకపోవడంతో ప్రత్యేక బృందాలుగా ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు  పోలీసులు. 

 

ఒక విల్లా విషయంలో ఆయన విల్లా యజమాని తో పడిన గొడవే దీనికి కారణం. ఆయన తనను అరెస్ట్ చేయవద్దు అని హైకోర్ట్ కి వెళ్ళగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దు అని హైకోర్ట్ సూచించింది. అయితే ఆయనను విచారించాలి అని పోలీసులు భావిస్తున్నారు. విజయవాడలోని పలు హోటల్స్ తో పాటుగా ఆయన సన్నిహితుల ఇళ్ళల్లో గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: