గురు పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెప్పారు. ఈ రోజు ఆశాధ పూర్ణిమ సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనిని గురు పూర్ణిమ అని కూడా అంటారని మోడీ చెప్పుకొచ్చారు. మనకు జ్ఞానం ఇచ్చిన మన గురువులను జ్ఞాపకం చేసుకునే రోజు ఇది అని ఆయన పేర్కొన్నారు. 

 

తాను బుద్ధుడికి నివాళులర్పించాను అని మోడీ చెప్పుకొచ్చారు. ఈ రోజు ప్రపంచం అసాధారణ సవాళ్ళతో పోరాటం చేస్తుంది అని మోడీ అన్నారు. ఈ సవాళ్లకు, బుద్ధుని ఆదర్శాల నుండి శాశ్వత పరిష్కారాలు రావచ్చని అన్నారు. అవి గతానికి సంబంధించినవే కాదు వర్తమానానికి కూడా సంబంధించినవి అని ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: