తెలంగాణలో వైరస్‌ ఉధృతి అరాచ‌కంగా మారింది. రోజు రోజుకు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చివ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉందంటే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో రోజుకు వెయ్యి కేసులు న‌మోదు అయ్యేలా ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతికి తోడు మరో వైపు జూలైలో వ‌ర్షాల‌కు విప‌రీతంగా కురిసే ఛాన్సులు ఉండ‌డంతో జూలై చివ‌ర‌కు క‌రోనా తెలంగాణ‌లో ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకుంటుంద‌ని వైద్య ఆరోగ్య శాఖ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. జూలై చివరి నాటికి రాష్ట్రంలో 60 వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతాయని భావిస్తోంది. 

 

ఇంత‌కు మించి ఈ కేసులు ల‌క్ష దాటినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని కూడా అంటున్నారు. టెస్టులు పెరిగితే రోజుకు 3 వేల‌కు పైగానే కేసులు న‌మోదు అవుతాయ‌ని అంటున్నారు. సేకరిస్తున్న నమూనాల్లో సగటున 22-25 శాతం పాజిటివ్‌గా నిర్థారణ అవుతున్నాయి. ఏదేమైనా ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే జూలై నెలాఖ‌ర‌కు ఏకంగా ల‌క్ష కేసులు అంటే తెలంగాణ‌లో తీవ్ర భ‌యాన‌క ప‌రిస్థితులు ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది. మ‌రి దీనిని ఎలా కంట్రోల్ చేయాల‌న్న అంశంపై ప్ర‌తి ఒక్క‌రు దృష్టి పెడితే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: