దేశంలో ఏమంట కరోనా కేసులు మొదలయ్యాయో కాని.. పెరిగిపోతూనే ఉన్నాయి. ఆ మద్య లాక్ డౌన్ చేసిన సమయంలో ఓ మాదిరిగా ఉన్నా.. లాక్ డౌన్ సడలించిన తర్వాత కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని రోజుల నుంచి దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22,771 కేసులు నమోదు అవగా...దాదాపు 442 మంది కరోనా బారిన పడి మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 

 

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 6,48,315కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 18,655కి పెరిగింది. 2,35,433 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,94,227 మంది కోలుకున్నారు.  కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 95,40,132  శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 2,42,383 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది. అయితే కరోనా కంట్రోల్ చేయడం మన చేతిలో పని అని.. సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ ని వాడటం తప్పని సరి వైద్యులు తెలియజేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: