ఒక పక్క ఉగ్రవాదులను వరుసగా కాల్చి చంపుతున్నా సరే వారిలో మార్పు రావడం లేదు. ఎప్పటికప్పుడు పోలీసుల లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేస్తూనే వస్తున్నారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో భారీ కుట్రను జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారత ఆర్మీ చేధించింది. 

 

జమ్మూ & కాశ్మీర్ లో రాజోరి సెక్టార్ లో... యుబిజిఎల్‌లు (అండర్ బారెల్ గ్రెనేడ్ లాంచర్) గ్రెనేడ్లు, ఎకె మ్యాగజైన్, పిస్టల్స్, ఐడ్‌మేకింగ్ మెటీరియల్‌తో డిటోనేటర్లు మరియు ప్రెజర్ గన్ తో పాటు ఇతర ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. పక్కా సమాచారంతో సోదాలు నిర్వహించారు అధికారులు. ఈ సోదాల్లో భారీగా ఆయుధాలను గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: