గత కొన్ని రోజులుగా భారత్ చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో చైనా జల భాగాలను కూడా పొరుగు దేశాల నుంచి లాక్కునే ప్రయత్నాలు చేస్తోంది. దక్షిణ చైనా సముద్రంలోని పలు దీవులను చైనా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. రాసెల్ దీవులకు సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. అమెరికా సహా పలు దేశాలు చైనా వైఖరిపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. 
 
దక్షిణ చైనా సముద్రంలో విన్యాసాల నేపథ్యంలో అమెరికా తన యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలోకి పంపుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా నేవీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జో జీలే దక్షిణ చైనా సముద్రంలో అమెరికాకు చెందిన యూఎస్ఎస్ నిమిట్జ్, యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్‌లు సైనిక విన్యాసాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివాదాస్పద సముద్ర జలాల్లో చైనా సైనిక విన్యాసాలు నిర్వహించడంపై అమెరికా విదేశాంగ మంత్రి గతంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: