వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అమరావతి ఉద్యమం మొదలై 200 రోజులైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతికి పర్యావరణ పరంగా ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అమరవాతే ఉండటం సమంజసం అని అన్నారు. అమరావతికి సీఎం జగన్ గతంలో మద్దతు తెలిపారని వ్యాఖ్యలు చేశారు. 
 
అమరావతిలో 80 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయని.... కరోనా సంక్షోభంలో డబ్బు వృథా చేయడం సరికాదని చెప్పారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతికే మద్దతు పలుకుతున్నారని అన్నారు. జగన్ సర్కార్ గత ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ నుంచి తప్పుకోవడం సరి కాదని వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణ తప్పనిసరి అయితే అమరావతిని పరిపాలన రాజధాని చేయాలని చెప్పారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: