తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోని ప్రైవేట్ ల్యాబులకు  షాక్ ఇచ్చింది.  ప్రైవేట్ ల్యాబులు తప్పులు సరిదిద్దుకోకుంటే మూసివేస్తామని హెచ్చరించింది. రాష్ట్రంలో కొన్ని గత రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రైవేట్ ల్యాబులకు అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన 23 ల్యాబుల్లో 13 ల్యాబుల్ రిపోర్టులు అసాధారణంగా ఉన్నాయని అధికారుల విచారణలో తేలింది. 

 

అయితే ఈ ల్యాబులకు సంబంధించిన వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. మరోవైపు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నా రికవరీ శాతం ఎక్కువగానే ఉందని ప్రభుత్వం చెబుతోంది. టిమ్స్ లో వచ్చే వారం నుంచి వైద్య సేవలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: