హైదరాబాద్ లో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి చర్యలు తీసుకున్నా సరే వేల కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కానిస్టేబుల్ తనకు కొడుకు పుట్టాడు అనే సంతోషంలో స్వీట్స్ పంచాడు. 

 

ఆ స్వీట్స్ తిన్న 12 మందికి కరోనా సోకింది. కానిస్టేబుల్ సోదరుడుకి కూడా కరోన సోకింది అని అధికారులు వెల్లడించారు. ఇప్పుడు ఆ 12 మంది కాంటాక్ట్ లను లాగే పనిలో పడ్డారు అధికారులు. ఇక అతని స్టేషన్ లో ఉన్న అధికారులు అందరికి కరోనా పరిక్షలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అందరూ హోం క్వారంటైన్ కి వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: