అమెరికా న్యూయార్క్​లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ లాక్​డౌన్​ను​ సడలించింది అక్కడి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రజలు బీచ్​లకు క్యూ కట్టారు.

 

 

న్యూయార్క్​లోని బీచ్​కి​ వందల సంఖ్యలో ప్రజలు వచ్చి చేరారు. మహమ్మారి వ్యాపిస్తున్నప్పటికి ప్రజలు భౌతిక దూరం పాటించకుండా సరదాగా గడిపారు. కాలిఫోర్నియాలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన అధికారులు లాస్​ఏంజెల్స్​, ఆరెంజ్​ కౌంటీలోని హంటింగ్టన్​తో పాటు పలు బీచ్​లను తాత్కాలికంగా మూసివేశారు. ఉత్తర కాలిఫోర్నియాలో పార్కింగ్​ సేవలను మాత్రమే మూసివేయగా.. బీచ్​లు యథావిథిగా కొనసాగుతున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: