అమెరికా లోని మిస్సిసిప్పీ రాజధానిలోని ఓ నైట్​ క్లబ్​లో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
హిండ్స్​ కౌంటీలోని జాక్సన్​లో ఎం-బార్​ స్పోర్ట్స్​ గ్రిల్​ వద్ద ఈ దుర్ఘటన జరిగిందని స్థానిక అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రమాదంలో 41ఏళ్ల కార్టెజ్​ షెల్బీ అనే వ్యక్తి అక్కడిక్కడే చనిపోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిలో ఓ మహిళ కూడా ఉంది. గాయపడినవారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

 

కాల్పులకు సంబంధించి అనుమానితుడి ఫొటోలను అధికారులు సామాజిక మాధ్యమాలలో పోస్ట్​ చేశారు. నిందితుడ్ని గుర్తించేందుకు సాయపడాలని ప్రజలను కోరింది. ఘటన అనంతరం నిందితుడు బార్​ నుంచి పారిపోయాడని, అతడు తమ కస్టడీలో లేడని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: