చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన వేళ 'ఆత్మనిర్భర భారత్ యాప్ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్' లో పాల్గొనాలని దేశీయ స్టార్టప్‌ కంపెనీలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఛాలెంజ్‌.. ఆత్మనిర్భర యాప్ ఎకో సిస్టమ్‌ను తయారు చేస్తుందన్నారు. అలా తయారయ్యే దేశీయ యాప్‌ల్లో కొన్నిటిని తాను కూడా వాడవచ్చేమోనని  పేర్కొన్నారు.

 


అంకుర సంస్థలకు ప్రభుత్వం తగిన సాయం అందిస్తుందన్నారు ప్రధాని మోదీ. ఈ-లెర్నింగ్‌, ఇంటిపని, గేమింగ్‌, బిజినెస్‌, వినోద, వ్యాపార రంగాలకు సంబంధించిన యాప్‌ల తయారీ కోసం.. కృషి చేయాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: