వీడియో స్ట్రీమింగ్ కోసం విండోస్ 10 యూజర్లకు యాప్​ను ఆవిష్కరించింది అమెజాన్​ ప్రైమ్​. మైక్రోసాఫ్ట్​ స్టోర్ ద్వారా ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

భారత్​లో విండోస్​ 10 యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్​ యాప్​ను విడుదల చేసింది. ఇకపై విండోస్ 10 వాడే డెస్క్​టాప్, ల్యాప్​టాప్, టాబ్లెట్​ యూజర్లు కొత్త యాప్​ ద్వారా వీడియో స్టీమింగ్ అనుభూతి పొందొవచ్చని అమెజాన్ ప్రైమ్​ వెల్లడించింది.

 


ఈ యాప్​ను మైక్రోసాఫ్ట్​ స్టోర్ ద్వారా డౌన్​లోడ్​ చేసుకోవచ్చని తెలిపింది. వీడియో కంటెంట్​ను ఆఫ్​లైన్​లోకి డౌన్​లోడ్ చేసుకునే సదుపాయం 10 ఓఎస్​లో మాత్రమే ఉండనున్నట్లు అమెజాన్​ ప్రైమ్ వెల్లడించింది. వెబ్​సైట్​లో ఎప్పటిలానే స్టీమింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: