దేశ రాజధాని ఢిల్లీ లో  కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో... అక్కడ ఆస్పత్రుల కొరత ఉండే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడ ఆ ఇబ్బంది లేదు అని ఆ రాష్ట్ర సిఎం అరవింద్ కేజ్రివాల్ చెప్తున్నారు. తాజాగా ఆయన ఒక ట్వీట్ చేసారు. తక్కువ మందికి ఇప్పుడు ఆసుపత్రి అవసరమని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

 

ఎక్కువ మంది కరోనా రోగులు ఇంట్లోనే చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు అని ఆయన వివరించారు. గత వారం రోజుల్లో 2300 మంది ఇంట్లోనే కోలుకున్నారు అని ఆయన వివరించారు. ఆసుపత్రిలో రోగుల సంఖ్య 6200 గా ఉందని అన్నారు ఆయన. 5300 మంది కరోనాతో బాధ పడుతున్నారు అని చెప్పారు. 9900 కరోనా పడకలు సిద్దంగా ఉన్నాయని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: